Mon Dec 23 2024 02:08:22 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు తెలుగులో రాబోతున్న 777చార్లీ
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రైమ్ వీడియో నుండి అప్డేట్ వచ్చింది.
ఎంతో టాలెంట్ ఉన్న కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన చిత్రం "777చార్లీ". ఈ సినిమా పాన్ ఇండియా రేంజులో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో జూన్ 10వ తేదీన విడుదలైంది. చార్లి అనే కుక్క ఓ వ్యక్తి జీవితంలోకి రావడం.. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన సినిమా. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. దర్శకుడు కె. కిరణ్ రాజ్ మంచి కథతో అందరినీ మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీని చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు.
777చార్లీ కన్నడ వెర్షన్ 'వూట్ సెలెక్ట్' లో స్ట్రీమింగ్ కొచ్చింది. మిగిలిన భాషల స్ట్రీమింగ్ పై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో 777 చార్లీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు, 777 చార్లీ కన్నడ వెర్షన్ మాత్రమే స్ట్రీమ్‌కు అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఇతర భాషల్లో ఎప్పుడు విడుదల చేస్తారా అని అడుగుతున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అందుకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ప్రైమ్ వీడియో స్టోర్ లో సెప్టెంబర్ 30 తేదీ నుండి చార్లీ సందడి చేయనుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రైమ్ వీడియో నుండి అప్డేట్ వచ్చింది.
Next Story