Mon Dec 23 2024 13:37:09 GMT+0000 (Coordinated Universal Time)
విశ్వవేదికపై తెలుగు పాట.. అదరగొట్టిన రాహుల్, కాలభైరవ
ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి వేసి స్టెప్పులు అందరినీ ఓ ఊపు ఊపేశాయి. ఆస్కార్ ఈవెంట్ ని..
95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఈరోజు ఉదయం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుక ఆరంభమైంది. ఈ వేడుక మన తెలుగు పాటతో మొదలవ్వడం చెప్పుకోదగిన విషయం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కోసం వేచి చూస్తున్న RRR నాటు నాటు పాటను సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ విశ్వవేదికపై ఆలపించారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచగా.. యావత్ ప్రపంచాన్నీ ఈ పాట ఉర్రూతలూగించింది.
ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి వేసి స్టెప్పులు అందరినీ ఓ ఊపు ఊపేశాయి. ఆస్కార్ ఈవెంట్ ని మొదలు పెడుతూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ గురించి మాట్లాడిన తరువాత ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు స్టేజి పై మరికొందరు డాన్సర్స్ నాటు నాటు స్టెప్పు వేశాడు. దీంతో నాటు నాటు తో ఆస్కార్ వేడుక మొదలైంది. విశ్వవేదికపై తెలుగు పాటకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు గాను రాజమౌళి అండ్ టీమ్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ పాటకు ఆస్కార్ వస్తుందా లేదా అనేది మరికొద్దిసేపటిలో తేలనుంది.
Next Story