Mon Dec 23 2024 09:12:36 GMT+0000 (Coordinated Universal Time)
రకుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలో ఉన్న ఆమె నివాసంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలో ఉన్న ఆమె నివాసంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ముంబయిలోని ఆమె నివాసముంటన్న బిల్డింగ్ 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించారు.
షూటింగ్ లో రకుల్...
వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో లేరు. షూటింగ్ లో ఉన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story