Thu Dec 19 2024 15:19:45 GMT+0000 (Coordinated Universal Time)
రేపు టాలీవుడ్ ప్రముఖుల కీలక భేటీ
రేపు టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనుంది. టాలీవుడ్ కు చెందిన 24 క్రాఫ్ట్ కు చెందిన వారందరూ హాజరు కానున్నారు
రేపు టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనుంది. టాలీవుడ్ కు చెందిన 24 క్రాఫ్ట్ కు చెందిన వారందరూ హాజరు కానున్నారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 240 మంది సభ్యులకు ఆహ్వానం అందింది. చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
చిత్ర పరిశ్రమ సమస్యలపై....
ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమై చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి వచ్చారు. టిక్కెట్ల ధరల తగ్గింపు పై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. త్వరలో టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story