Mon Dec 23 2024 14:31:31 GMT+0000 (Coordinated Universal Time)
హనుమాన్ జయంతి స్పెషల్ : ఆదిపురుష్ నుంచి మరో పోస్టర్ రిలీజ్
ఈ సినిమా ఈ ఏడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని..
రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. తాజాగా ఈ సినిమా నుంచి హనుమాన్ జయంతి కానుక వచ్చింది. సినిమాలో హనుమంతుడి పోస్టర్ ను మేకర్స్ హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఆదిపురుష్ లో హనుమంతుడిగా దేవదత్త నాగే నటించగా.. తాజాగా వదిలిన పోస్టర్ లో హనుమంతుడు తన మనస్సులో శ్రీరామ అని తలచుకుంటూ.. తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్లో శ్రీరామ పాత్రదారి అయిన ప్రభాస్ కనిపిస్తున్నారు.
‘రాముడి భక్తుడు.. రామ కథకి ప్రాణం.. జై పవనపుత్ర హనుమాన్’ అంటూ దర్శకుడు ఓమ్ రౌత్ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఆదిపురుష్ సినిమా రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్క రించుకుని చిత్రబృందం ఈ మధ్యే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలను రివీల్ చేసేలా ఓ పోస్టర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదిపురుష్లో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.
Next Story