Tue Dec 24 2024 00:43:16 GMT+0000 (Coordinated Universal Time)
అందరి ముందు అతడు ప్రపోజ్ చేశాడు.. అమీర్ కూతురు 'ఎస్' చెప్పింది
వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు 2020 నుంచే ప్రచారం జరుగుతోంది. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు
అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ చాలా విషయాలను ఏ మాత్రం దాచుకోదు. తన సోషల్ మీడియా ఖాతాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో డేటింగ్ చేస్తున్న ఇరా ఖాన్. ఇప్పుడు అతడి ప్రపోజల్ కు ఓకె చెప్పేసింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత అతడి ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్లు ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఇరా ఖాన్ నుపుర్ సైక్లింగ్ ఈవెంట్ కు హాజరు కాగా.. ఆ సమయంలో అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు.
వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు 2020 నుంచే ప్రచారం జరుగుతోంది. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ వెళ్లాడు. ఇరా కూడా వెళ్లింది. పోటీలు ముగిసిన తర్వాత ఇరా వద్దకు చేరుకుని, మోకాలిపై కూర్చొని... నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె ఎస్ చెప్పింది. ఆ తర్వాత ఇరాకు ఉంగరాన్ని తొడిగి, ముద్దు పెట్టాడు. తాను ఎస్ చెప్పాను అని సోషల్ మీడియా వేదికగా ఐరా కూడా వెల్లడించింది. రొమాంటిక్ ప్రపోజల్ వీడియోను ఇరా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇరా ఇతర వ్యక్తులతో పాటు ప్రేక్షకులలో నిలబడి కనిపిస్తుంది. నుపుర్ ఆమె వైపు నడుస్తూ, తన మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఇరా ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య, నిర్మాత రీనా దత్తా కుమార్తె.
Next Story