Wed Dec 25 2024 06:00:13 GMT+0000 (Coordinated Universal Time)
ముద్దు ఎక్స్సైజ్ చూశారా..? ప్రియుడుతో కలిసి స్టార్ హీరో కూతురు..
ఒక స్టార్ హీరో కూతురు జిమ్ లో ప్రియుడితో కలిసి 'ముద్దు ఎక్స్సైజ్' చేస్తూ, దానిని వీడియో చేసి నెట్టింట పోస్ట్ చేసింది.
రొమాంటిక్ సన్నివేశాలు ఈమధ్య సినిమాల్లో కంటే బయట ఎక్కువ కనిపిస్తున్నాయి. పబ్లిక్ ప్లేస్ ల్లోనే లిప్లాక్లు, రొమాన్స్ చేసుకుంటూ వైరల్ అవుతున్నారు. ఇక ఈ విషయాలు కొందరికి చిరాకు తెప్పిస్తున్నాయి. కొందరు అయితే విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ చేసే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇక తాజాగా ఒక స్టార్ హీరో కూతురు.. జిమ్ లో ప్రియుడితో కలిసి 'ముద్దు ఎక్స్సైజ్' చేస్తూ, దానిని వీడియో చేసి నెట్టింట పోస్ట్ చేసింది.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా..? మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. అతని కూతురు ఐరా ఖాన్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా సోషల్ మీడియా పోస్టులతో బాగా వైరల్ అవుతుంటుంది. అందాల ఆరబోస్తూ ఈ అమ్మడు పోస్టులు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. ఈ భామ.. తన ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. గత ఏడాది నవంబర్ 18న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
ఇప్పుడు పెళ్ళికి సిద్దమవుతున్న ఈ కొత్త జంట జిమ్ లో కొత్త కొత్త వర్క్ ఔట్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. జిమ్ లో ఐరా, నుపుర్ కలిసి కౌగిలించుకొని 'పుల్ అప్స్' చేశారు. అంతేకాదు ప్రతి పుల్ అఫ్ కి ఒక లిప్ లాక్ ఇచ్చుకుంటూ రొమాన్స్ చేశారు. ఈ మొత్తం రొమాన్స్ వర్క్ అవుట్ ని వీడియో తీసి ఐరా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
ఇవేమి ఎక్స్సైజ్ లు తల్లి, ఇలాంటి రొమాన్స్ వీడియోలు షేర్ చేసి ఏం మెసేజ్ లు ఇద్దామనుకుంటున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఐరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి తేదీని ఆమీర్ ఖాన్ తెలియజేశాడు. 2024 జనవరి 3లో వీరిద్దరి పెళ్లి జరగబోతుంది అంటూ తెలియజేశాడు. ఐరా ఖాన్ డిప్రెషన్లో ఉన్న సమయంలో నుపురే అండగా నిలబడ్డాడని, అలాంటి మంచి వ్యక్తి తన కూతురికి భర్తగా దొరికినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
Next Story