Tue Dec 24 2024 01:04:54 GMT+0000 (Coordinated Universal Time)
Aamir Khan : ఆమిర్ కూతురు పెళ్లి చూశారా.. ఇదెక్కడి ఆచారంరా బాబు..
ఆమిర్ ఖాన్ కూతురు పెళ్లి వీడియో చూశారా..? పెళ్లి కొడుకు పెళ్ళికి ఎలా వచ్చారో చూస్తే.. ఇదెక్కడి ఆచారంరా బాబు అంటారు.
Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం అయ్యిపోయింది. కూతురు ప్రేమించిన వాడితోనే ఆమిర్ ఆమె వివాహం జరిపించారు. తన ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ఐరా ఖాన్ ప్రేమలో పడింది. ఇక వీరి ప్రేమని అంగీకరించిన ఆమిర్.. 2022 నవంబర్ 18న ఇద్దరికీ నిశ్చితార్థం చేశారు. తాజాగా పెళ్లి తతంగం కూడా పూర్తి చేసేశారు.
ఈ బుధవారం జనవరి 3న ఈ వివాహం జరిగింది. ముంబయి తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్లో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్ళికి అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, కొడుకులు ఆజాద్ ఖాన్, జునైద్ ఖాన్ తో పాటు ఇరు కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ ఈ పెళ్ళికి పెళ్ళికొడుకు వచ్చిన పద్ధతి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి వేదిక దగ్గరకి ఎలా చేరుకుంటాడు.. బారాత్ తో సంబరం చేసుకుంటూ వస్తారు. కానీ ఈ పెళ్ళికి వరుడు నుపుర్ శిఖరే ఎలా వచ్చాడంటే.. ముంబై రోడ్ల మీద 8 కిలోమీటర్లు జాగింగ్ చేసుకుంటూ హోటల్ కి వచ్చాడు. జాగింగ్ డ్రెస్సులోనే పెళ్లి వేదిక దగ్గరకి చేరుకున్న నుపుర్ శిఖరే.. అదే డ్రెస్సుతో పెళ్లి చేసేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మధ్య ఆమిర్ కుటుంబ పద్దతిలో పెళ్లి తతంగం పూర్తి అయ్యింది.
అయితే పెళ్ళికి వరుడు ఇలా రావడం చూసిన.. నెటిజెన్స్ ఇదెక్కడి ఆచారంరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నూపుర్ శిఖరే జిమ్ ట్రైనర్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ విషయాన్ని తెలియజేస్తూ పెళ్లిని వెరైటీగా చేసుకోవడానికే ఇలా చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Next Story