Mon Dec 23 2024 15:40:54 GMT+0000 (Coordinated Universal Time)
58 WEDS 32 : అమీర్ ఖాన్ మూడో పెళ్లి ?
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ద్వారా ఫాతిమా గుర్తింపు పొందింది. ఆ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన థగ్స్ ఆఫ్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇది అతను నటించబోయే సినిమా గురించి మాత్రం కాదు. నాగచైతన్యతో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా.. డిజాస్టర్ గా నిలిచింది. ఆ నిరాశ నుండి బయటపడేందుకు అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్నిఆస్వాదిస్తున్నాడు. తాజాగా.. అమీర్ ఖాన్ ఓ యువతితో డేటింగ్ చేస్తున్నాడంటూ ఇంటర్నెట్ లో రూమర్స్ వచ్చాయి. ఫాతిమా సనా షేక్ అనే మహిళతో అమీర్ డేటింగ్ లో ఉన్నాడని సమాచారం.
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ద్వారా ఫాతిమా గుర్తింపు పొందింది. దంగల్ లో ఫాతిమా అమీర్ ఖాన్ పెద్దకూతురిగా నటించింది. ఆ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఆ సినిమా విడుదల సమయంలోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. లాల్ సింగ్ చద్దా విడుదల అనంతరం.. అమీర్ తన 16 సంవత్సరాల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. తన భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఫాతిమా - అమీర్ డేటింగ్ పై మరోసారి వార్తలు వైరల్ గా మారాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమీర్ తన వయసులో సగం వయసున్న అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు నెటిజన్లలో ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఇద్దరూ స్పందించలేదు.
Next Story