Mon Dec 23 2024 20:05:38 GMT+0000 (Coordinated Universal Time)
అమీర్ ఖాన్ కు ఉన్న ధైర్యం.. మన హీరోలకు లేదా..?
చాలా సినిమాలు.. సినిమా హిట్ అయిన వెంటనే OTTలో విడుదలవుతాయి.
జనాలు చాలా వరకు థియేటర్స్ కు రావడం లేదు. అందుకు ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉందనే విమర్శలు చాలా వస్తూ ఉన్నాయి. అయితే మంచి కంటెంట్ తో వస్తే తప్పకుండా థియేటర్స్ కు జనాలు వస్తారని అంటున్నారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా థియేటర్ వైపు సినీ జనం ఈ మధ్య కాలంలో కన్నెత్తి చూడడం లేదు.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కొత్త చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతూ ఉంది. అనేకసార్లు సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా విడుదల చేయాలని భావిస్తూ ఉన్నారు. అనుకున్నట్లుగా సినిమాలో నాగ చైతన్యను కూడా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఇప్పట్లో విడుదలవ్వడం కష్టమనే అంటున్నారు. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 6 నెలల వరకు OTTలో విడుదల చేయరని అంటున్నారు.
చాలా సినిమాలు.. సినిమా హిట్ అయిన వెంటనే OTTలో విడుదలవుతాయి. అందుకే థియేటర్కి వెళ్లి సినిమా చూడాలనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కొంత తగ్గింది. ఇదే విషయం గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ "సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వెంటనే OTTలో వస్తాయి, అవి చాలా తొందరగా OTTలోకి వచ్చేస్తాయి. కాబట్టి థియేటర్లకు వెళ్లే ఉత్సాహం తగ్గిందని నేను భావిస్తున్నాను. నా సినిమాలకు 6 నెలల గ్యాప్ ఇస్తాను. దీన్ని సినిమా ఇండస్ట్రీ ఫాలో అవుతుందో.. లేదో నాకు తెలియదు.. కానీ నేను మాత్రం ఓటీటీ రిలీజ్ కు 6 నెలల గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను నా సినిమాలన్నింటినీ అలాగే విడుదల చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాను" అని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా ట్రైలర్, సౌండ్ట్రాక్, మ్యూజిక్..కు ఇప్పటికే మంచి పేరు వచ్చింది. లాల్ సింగ్ చడ్డా ట్రైలర్ అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. లాల్ సింగ్ చడ్డా జీవిత ప్రయాణాన్ని అమీర్ ఖాన్ ఎలా చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిరణ్ రావు మరియు వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన 'లాల్ సింగ్ చద్దా'లో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్, అక్కినేని నాగ చైతన్య నటించారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కి ఇది అధికారిక రీమేక్. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది.
Next Story