Mon Dec 23 2024 06:21:51 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ దేవరకొండ vs నిర్మాత అభిషేక్ నామా..
విజయ్ దేవరకొండ కోటి ప్రైజ్ మనీ పై నిర్మాత అభిషేక్ నామా చేసిన ట్వీట్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా ఖుషి (Kushi) మూవీతో సక్సెస్ ని అందుకున్నాడు. దాదాపు 5 ఏళ్ళ తరువాత మళ్ళీ హిట్ అందడంతో విజయ్ ఫుల్ ఖుషీ అయ్యిపోతున్నాడు. ఈ ఆనందంతోనే తనకి ఈ విజయాన్ని అందించిన అభిమానుల కోసం ఒక బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు. ఒక 100 కుటుంబాలను ఎంపిక చేసి.. వారిలో ప్రతి ఫ్యామిలీకి లక్ష చొప్పున బహుమానం అందిస్తాను అంటూ ప్రకటించాడు.
అందుకోసం ఒక అప్లికేషన్ లింక్ ని కూడా షేర్ చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఒక ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ.. ఈ ఆఫర్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. 2020లో భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టం కలిగింది.
ఇక ఈ మూవీ నష్టం గురించి మాట్లాడుతూనే ‘అభిషేక్ పిక్చర్స్’ ట్వీట్ చేసింది. "డియర్ విజయ్ దేవరకొండ.. మీరు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి మేము దాదాపు రూ.8 కోట్లు నష్టపోయాము. కానీ ఆ విషయం పై ఇప్పటివరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మీ గొప్ప మనసుతో కొన్ని ఫ్యామిలీస్ కి కొంత డబ్బుని సహాయంగా అందజేస్తున్నారు. అలాగే ఆ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతున్నాము" అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఈ ట్వీట్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి విజయ్ అండ్ అభిషేక్ పిక్చర్స్ మధ్య అసలు ఏం జరిగింది అనేది తెలియదు. కానీ ఒక హీరోని ఒక నిర్మాణ సంస్థ పబ్లిక్ గా ఇలా ట్రోల్ చేయడం పై కొందరు నెటిజెన్స్ తప్పుబడుతున్నారు. ఇదే ప్రశ్నను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరోని కూడా అడుగుతారా అని నిర్మాత అభిషేక్ నామాని క్యూస్షన్ చేస్తున్నారు.
Next Story