Thu Dec 19 2024 13:05:20 GMT+0000 (Coordinated Universal Time)
హీరో నానిపై పడిన బొగ్గు లోడు
ఇక ఈ సినిమాకు సంబంధించి ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా
హీరో నాని ప్రస్తుతం 'దసరా' సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని వినిపిస్తోంది.
సినిమా షూటింగ్ లో హీరో నాని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నాని నటిస్తున్న దసరా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక్కడే భారీ బొగ్గు గని సెట్ వేశారు. ఓ బొగ్గు లారీ కింద నాని నటించే సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, బొగ్గు లోడు మొత్తం ఒక్కసారి నానిపై పడింది. దాంతో సెట్స్ పై ఉన్న అందరూ ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. నాని ఆ బొగ్గులోంచి క్షేమంగా బయటికి రావడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ ను కాసేపు నిలిపివేశారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక నాని మళ్లీ షూటింగ్ కు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. దసరా చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాని గూడ్స్ ట్రైన్లో తన గ్యాంగ్తో కలిసి హాస్యాన్ని చిందిస్తున్నాడు. 'ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం' అంటూ చిత్రబృందం క్యాప్షన్ కూడా ఇచ్చింది. సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్ స్వరాలను సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాని కమర్షియల్ సక్సెస్ అందుకుని చాలా రోజులే అవుతోంది. ఈసారి ఫుల్ మాస్ రోల్ లో నాని కనిపిస్తూ ఉన్నాడు.
Next Story