Mon Dec 23 2024 05:23:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్యలో కాజల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ
ఈ సినిమా చేస్తున్న సమయంలోనే కాజల్ గర్భవతి కూడా అయ్యింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కారణంగానే..
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమాలో కాజల్ కూడా ఒక భాగమే అన్న సంగతి తెలిసిందే..! లాహే.. లాహే.. పాటలో కూడా కాజల్ కనిపిస్తుంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే కాజల్ గర్భవతి కూడా అయ్యింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కారణంగానే ఆమె సినిమా ప్రమోషన్స్ కు హాజరు అవ్వడం లేదని ఇన్నాళ్లూ అనుకున్నారు. అయితే సినిమాలో ఆమె పాత్ర గురించి దర్శకుడు కొరటాల శివ సంచలన ప్రకటన చేశారు.
కొరటాల శివ మాట్లాడుతూ కాజల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో కాజల్ పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. సరైన ప్రాధాన్యత లేని పాత్రలో హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్రకు ప్రేమపై ఆసక్తి ఉండదని... అయితే కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాజల్ పాత్రను తీసుకుని రావడానికి ట్రై చేశానని తెలిపారు. తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూశానని తనకు సంతృప్తిగా అనిపించలేదని చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో చెపితే... కాజల్ పాత్రను ఉంచాలా? వద్దా? అనే విషయాన్ని తనకే వదిలేశారని కొరటాల శివ అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాజల్ కు చెప్పాగా ఆమె నవ్వుతూనే స్పందించిందని చెప్పారు. 'ఆచార్య' నుంచి కాజల్ పాత్రను పూర్తిగా తప్పించామని అన్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిందని చెప్పారు.
'ఆచార్య' సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం రన్ టైమ్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. చిత్ర నిడివి 154 నిమిషాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story