Sat Dec 21 2024 07:49:04 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్య కూడా హిందీలో రిలీజ్ ఉంటుందట.. రామ్ చరణ్ చెబుతోంది ఇదే..!
మొదట ఆచార్యను హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఆచార్యను
'ఆచార్య'.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎన్నో వాయిదాల కారణంగా ఏప్రిల్ 29న థియేటర్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 29న ఆచార్య దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల అవుతుంది. హిందీలో మాత్రం విడుదల కావడం లేదు.
ఆచార్య హిందీ వెర్షన్‌పై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆచార్య మూవీ షూటింగ్ మేం అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యమైంది. నేను ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తుండటంతో నాకు చాలా తక్కువ సమయం దొరికింది. మొదట ఆచార్యను హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఆచార్యను కూడా హిందీలో రిలీజ్ చేయాలని అనుకున్నామని తెలిపారు రామ్ చరణ్. హిందీలో రిలీజ్ చేయాలంటే డబ్బింగ్, పొస్ట్‌ప్రొడక్షన్ పనులకు చాలా సమయంలో పడుతుందని.. మా దగ్గర అంత టైం లేదని చరణ్ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 29 నాటికి హిందీ వెర్షన్‌ను రెడీ చేయలేకపోయామని వివరించారు. ఆచార్య సినిమాను ఖచ్చితంగా హిందీలో రిలీజ్ చేస్తామని, తన పాత్రకు తానే స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పుకుంటానని చరణ్ తెలిపారు. కానీ దీనికి కాస్తా సమయం పడుతుందని, దక్షిణాది భాషల్లో విడదుల అనంతరం హిందీ వెర్షన్‌పై దృష్టి పెడతామని చెప్పుకొచ్చారు.
ఆచార్యకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
ఆచార్య చిత్రానికి సంబంధించి ఐదో ఆటకు అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 29న విడుదల కానున్న ఆచార్య సినిమాను ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆటల చొప్పున ప్రదర్శనకు వీలు కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లలో ఆయా కేటగిరీలను బట్టి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు సినిమా థియేటర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్రమే ఈ పెంపును ప్రభుత్వం అనుమతించింది. ఈ ధరలను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వరకు మాత్రమే అనుమతించింది.
Next Story