Mon Dec 23 2024 09:36:11 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్స్.. టార్గెట్ రీచ్ అవుతుందా ?
ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం సినిమా పై మిక్స్ డ్ టాక్ వచ్చింది. తండ్రి, కొడుకులు కలిసి నటించిన
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం సినిమా పై మిక్స్ డ్ టాక్ వచ్చింది. తండ్రి, కొడుకులు కలిసి నటించిన సినిమాగానే ఆచార్య ఉంది తప్ప.. కొరటాల నుంచి ఊహించిన సన్నివేశాలు లేవన్న టాక్ వచ్చింది. మరి భిన్నాభిప్రాయాల మధ్య ఆచార్య సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది ? ఆచార్య అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా ? ఇప్పుడు చూద్దాం.
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.135 కోట్లు జరిగింది. తొలిరోజు వసూళ్ల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.29.59 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్ సీస్ అంతా కలిపి మరో 6 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా తొలిరోజున ఆచార్యకు రూ. 35 కోట్లు వసూలయ్యాయి. ఆచార్యను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసి ఉంటే.. మంచి కలెక్షన్స్ వచ్చేవని సినీ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగులోనే విడుదలైనప్పటికీ.. వీకెండ్, మరోవారం వరకూ మరో సినిమా విడుదల లేకపోవడం ఆచార్యకు కలిసొచ్చే విషయాలని చెప్తున్నారు.
Next Story