Mon Dec 23 2024 13:47:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్య టికెట్ కనీస ధరను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
మల్టీప్లెక్సులతో గరిష్ఠంగా టికెట్ ధర రూ.300కు చేరింది. ఈ ఏడాది మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేదలకు సినిమా..
అమరావతి : కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలైన తొలి 10 రోజుల వరకూ.. టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ప్రీమియం, నాన్ ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని రకాల టికెట్ల ధరలపై రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. ఆచార్య సినిమా టికెట్ కనీస ధర రూ.70కి చేరింది.
మల్టీప్లెక్సులతో గరిష్ఠంగా టికెట్ ధర రూ.300కు చేరింది. ఈ ఏడాది మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేదలకు సినిమా వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి థియేటర్లో కనీసం 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఆదేశించింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు నాన్ ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలకు ఒకేలా ధరలు పెంచుకోవచ్చని పేర్కొంది. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల ధరలు కూడా ఇలాగే పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
Next Story