Fri Dec 20 2024 05:37:04 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD : 9 భాగాలుగా 'కల్కి'.. టాలీవుడ్ యాక్టర్ కామెంట్స్..
ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటుడైన అభినవ్.. 'కల్కి' 9 భాగాలుగా రాబోతుందంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందూ మైథలాజి స్టోరీస్ని ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా చూపిస్తూ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది.. ఈ మూవీకి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతూ ఆడియన్స్ లో మరింత అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వార్త.. కల్కి 9 భాగాలుగా రాబోతుంది అనే న్యూస్. ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియక ఆడియన్స్ అంతా ఆసక్తితో ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ఇండస్ట్రీ వ్యక్తి అయిన నటుడు అభినవ్ గోమఠం ఈ 9 భాగాలు వార్త గురించి మాట్లాడం ఆసక్తిని రేపుతోంది. అభినవ్ యాక్ట్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయి రా' మూవీ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో అభినవ్ మాట్లాడుతూ.. "కల్కి సినిమా కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నేను విన్న వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ఆ సినిమా మొత్తం 9 భాగాలుగా రాబోతుందని విన్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటుడైన అభినవ్.. ఇలా కామెంట్ చేయడంతో 9 భాగాలు వార్త మరింత వైరల్ గా మారింది. మరి కల్కి మేకర్స్ నిజంగానే ఆ చిత్రాన్ని అంతటి భారీ స్కేల్ ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది చూడాలి.
కాగా వైజయంతి మూవీస్ పతాకం పై సి అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వీరితో పాటు రాజమౌళి, రానా, అమితాబ్ బచ్చన్, నాని, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కూడా కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మే 9న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
Next Story