Mon Dec 23 2024 02:54:08 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ నటుడు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
కంగనా నటించిన ఎమర్జెన్సీలోనూ సతీష్ నటించారు కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మంగళవారం జరిగిన హోలీ..
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖుల మరణాలు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్(67) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటివరకూ సతీష్ కౌశిక్ 100కి పైగా హిందీ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అలాగే 20 సినిమాలకు దర్శకత్వం వహించారు.
సతీష్ కౌశిక్ దర్శకుడిగా మొదటి సినిమా అనిల్ కపూర్, శ్రీదేవిలతో రూప్ కీ రాణి చోరోన్ కా రాజా సినిమాని తెరకెక్కించాడు. చివరిగా 2021లో కాగజ్ సినిమాను తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో చివరిసారిగా నటుడిగా కనిపించాడు. కంగనా నటించిన ఎమర్జెన్సీలోనూ సతీష్ నటించారు కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మంగళవారం జరిగిన హోలీ వేడుకల్లోనూ చురుగ్గా పాల్గొన్న ఆయన ఇప్పుడు లేరని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సతీష్ తో ఉన్న ఫోటో షేర్ చేసి.. అందరూ మరణిస్తారని తెలుసు. కానీ నేను జీవించి ఉన్నప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ గురించి ఇలా రాస్తాననుకోలేదు. మా 45 ఏళ్ళ స్నేహం అర్దాంతరంగా ముగిసిపోయింది. సతీష్ లేకుండా నా జీవితం గతంలో లాగా ఉండదు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.
Next Story