Mon Dec 23 2024 15:33:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీలో మరో విషాదం.. అనారోగ్యంతో దర్శకుడు మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. టపోరి సత్య తల్లి మాట్లాడుతూ
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సింగర్లు ఇలా ఇండస్ట్రీకి చెందిన వారు కన్నుమూస్తూ.. వారి కుటుంబాలతో పాటు అభిమానులకు కూడా శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు టపోరి సత్య(45) అనారోగ్యంతో కన్నుమూశారు. టపోరి సత్యకు కిడ్నీ ఫెయిల్ కావడంతో ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. టపోరి సత్య తల్లి మాట్లాడుతూ.. "సత్య కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో హాస్పిటల్ కి తీసుకు వచ్చాం.. వారం రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు.. తన జీవితం సినిమాలకే అంకితం అనేవాడు. కుటుంబం కోసం ఎంతో కష్టపడేవాడు.. సత్య మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది." అని కన్నీటి పర్యంతమయ్యారు.
యోగేష్ - నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత సినిమాలో టపోరి సత్య విలన్ పాత్రలో నటించారు. ఆ తర్వాత మేళా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. మరో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. టపోరి సత్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story