Sun Dec 22 2024 17:20:59 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియో.. ఆ వాయిస్ నాది కాదంటున్న బండ్ల ?
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలంటూ పవన్ అభిమానులు బండ్ల గణేష్ కు ఫోన్ చేసి, అడుగుతున్నట్లుగా ఆ ఆడియో కాల్ లో..
సోషల్ మీడియాలో బండ్ల గణేష్ త్రివిక్రమ్ ను తిడుతూ మాట్లాడినట్లుగా ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ ఆడియో కాల్ లో బండ్ల గణేష్ పవన్ అభిమానులతో మాట్లాడుతూ.. డైరెక్టర్ త్రివిక్రమ్ ను తిడుతూ మాట్లాడిన మాటలు లీకయ్యాయి. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలంటూ పవన్ అభిమానులు బండ్ల గణేష్ కు ఫోన్ చేసి, అడుగుతున్నట్లుగా ఆ ఆడియో కాల్ లో ఉంది. త్రివిక్రమ్ వైసీపీ నాయకులతో కుమ్మక్కై.. తనను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకుండా చేస్తున్నాడని వాపోతాడు. మీరు ఎలాగైనా రావాలని పవన్ ఫ్యాన్స్ రిక్వెస్టింగ్ అడుగుతారు.
ఈ ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో.. బండ్ల గణేష్ స్పందించాడు. దీనిపై ఓ ప్రముఖ ఛానెల్ కు వివరణ ఇస్తూ.. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, ఎవరో ఫేక్ ఆడియో క్రియేట్ చేశారని ఖండించారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తనను ఆహ్వానించకపోవడంపై తాను స్పందించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. అయితే బండ్ల గణేష్ చెప్పింది నిజమేనా ? అతను చెప్పినట్లు ఆ ఆడియోలో ఉన్నది బండ్ల వాయిస్ కాకపోతే.. అతనిని టార్గెట్ చేస్తూ ఇలా ఆడియో క్రియేట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
News Summary - Actor come Producer Bandla Ganesh Responce on Leaked Audio call about Trivikram
Next Story