హన్సిక పెళ్లి గురించి లీకైన మరిన్ని విషయాలు
నటి హన్సిక మోత్వాని నెల రోజుల్లోపే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఆమె డిసెంబర్ 4 న పెళ్లి చేసుకోబోతోందనే సమాచారం బయటకు వచ్చింది. హన్సికకు సన్నిహితంగా ఉండే వ్యక్తి మాట్లాడుతూ, "డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 4 వరకు వివాహ వేడుకలు జరుగుతాయి. ఇది వారి కుటుంబం, సన్నిహితులు మాత్రమే జైపూర్ లో హాజరయ్యే డెస్టినేషన్ వెడ్డింగ్." అని తెలిపారు. డిసెంబర్ 4 సాయంత్రం పెళ్లి జరగనుంది. డిసెంబరు 2న సూఫీ నైట్, మరుసటి రోజు మెహందీ, సంగీత్ లు ఉంటాయి. అంతేకాకుండా పోలో మ్యాచ్ ఆడనున్నారు. ప్రతి రోజు డ్రెస్ కోడ్, థీమ్ ఉంటుంది. జైపూర్లోని ముండోటా ప్యాలెస్ వివాహ వేదిక అని చెబుతున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కొందరు అంటుండగా.. ప్రేమ వివాహమని కొందరు అంటున్నారు. "హన్సిక తన ప్రియుడిని వివాహం చేసుకోబోతోంది, ఆమె కొన్ని సంవత్సరాలుగా అతడికి తెలుసు.. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది" అనే కామెంట్లు కూడా వినపడుతూ ఉన్నాయి.