Mon Dec 23 2024 07:55:39 GMT+0000 (Coordinated Universal Time)
విష్ణుప్రియతో బంధంపై క్లారిటీ ఇచ్చిన జేడీ
విష్ణుప్రియకు - తనకు మంచి అనుబంధం ఉందన్న జేడీ.. అది ప్రేమ కాదన్నారు. ఆమె చాలా మంచి అమ్మాయి అని, ఇటీవలే ఇద్దరం కలిసి..
జేడీ చక్రవర్తి.. ఒకప్పుడు విభిన్న కథా చిత్రాల్లో నటించి ఎంతో పాపులర్ అయిన నటుడు. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా ఆయన నటించిన సినిమాల్లో ఏ సినిమాకు ఆ సినిమానే ప్రత్యేకం. జేడీ చక్రవర్తికి వివాహమై.. విడాకులు కూడా అయ్యాయి. అయితే ఇటీవల బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తనకు ఛాన్స్ వస్తే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేడీ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. విష్ణుప్రియ తన గురించి అలాంటి వ్యాఖ్యలు చెప్పడానికి గల కారణాలను వివరించారు.
విష్ణుప్రియకు - తనకు మంచి అనుబంధం ఉందన్న జేడీ.. అది ప్రేమ కాదన్నారు. ఆమె చాలా మంచి అమ్మాయి అని, ఇటీవలే ఇద్దరం కలిసి ఓ సిరీస్ లో నటించామన్నారు. త్వరలోనే ఆ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలిపారు. దానికోసం దాదాపు 40 రోజులు కలిసి వర్క్ చేశామన్నారు. అయితే.. సిరీస్ షూటింగ్ సమయంలో దర్శకుడు పవన్ సాధినేని.. విష్ణుప్రియకు తాను నటించిన సినిమాలు రోజుకొకటి చూడమని సలహా ఇచ్చాడు. అలా తన సినిమాలు చూసిన విష్ణుప్రియ.. ఆయా సినిమాల్లోని పాత్రలతో ప్రేమలో పడిందే తప్ప.. నిజంగా తనను ప్రేమించలేదన్నారు. తామిద్దరి బంధం.. కేవలం గురు-శిష్యుల అనుబంధమేనని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. తామిద్దరం చాలా తక్కువగా మాట్లాడుకుంటామని చెప్పారు.
Next Story