Mon Dec 23 2024 06:11:44 GMT+0000 (Coordinated Universal Time)
నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. గమ్యం దిశగా వెళ్లాలనుకుంటున్నా !
ఇన్నాళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా.. ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒకరకంగా చూస్తే..
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ఓ పోస్ట్ చేశారు. రేపు జనసేన ఆవిర్భావ సభకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో నాగబాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తనను.. వెన్నంటి నడిపించింది కష్టాలేనని, వాటి వల్లే ఈ స్థాయికి వచ్చానంటూ పేర్కొన్నారు నాగబాబు. ఇకపై గమ్యం దిశగా వెళ్లాలనుకుంటున్నానని, తన సమయాన్ని దానికే కేటాయించాలనుకుంటున్నట్లు తెలిపారు.
"ఇన్నాళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా.. ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒకరకంగా చూస్తే.. ఈ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి బాగా సాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన దేశానికి, నా ప్రజలకు సాయపడాలని నిర్ణయించుకొని, అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను.
నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే ! అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని గమ్యం దిశగా వెళ్లడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకి వస్తా. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది." అని పోస్ట్ చేశారు.
Next Story