Mon Dec 23 2024 13:54:59 GMT+0000 (Coordinated Universal Time)
పవిత్ర - నరేష్ ల పెళ్లి... కొత్త ఏడాదిలో
సినీనటుడు నరేష్, పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకోబోతున్నారు. కొత్త ఏడాది కొత్త ఆరంభం అంటూ ట్వీట్ చేేశారు నరేష్.
సినీనటుడు నరేష్, పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకోబోతున్నారు. కొత్త ఏడాది కొత్త ఆరంభం అంటూ ట్వీట్ చేేశారు నరేష్. లిప్ లాక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవిత్ర, నరేష్ లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. పవిత్రకు గతంలోనూ పెళ్లయింది. అలాగే నరేష్ కు ఇది నాలుగో వివాహం.
కొద్ది రోజులుగా ...
వారు గత కొద్ది రోజులుగా కలసి తిరుగుతున్నారు. వారిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు కూడా వస్తున్నాయి. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అయితే కొత్త ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు నరేష్ వెల్లడించడంతో వారు 2023లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Next Story