Mon Dec 23 2024 08:13:56 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటా : నటుడు నరేశ్
పవిత్ర లోకేశ్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే.. తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్లు
ప్రముఖ సినీ నటుడు నరేష్.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా.. తీసిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా మే 26వ తేదీన విడుదల కానుంది. ఈక్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. సినిమాలో కలిసి నటించిన నరేష్ - పవిత్ర ల జంట తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవిత్ర లోకేశ్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే.. తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పేశారు. ‘‘నిజానికి పెళ్లి అనేది అంత ఖచ్చితంగా అవసరం లేదు. చాలా మంది ఇష్టం లేకుండా, సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వారికోసమే 'మళ్లీ పెళ్లి' సినిమా’’ అని నరేశ్ ఈ సందర్భంగా తెలిపారు. తనకు - పవిత్ర లోకేశ్ కు ఇంకా పెళ్లి కాకపోయినా.. అభిప్రాయాలు, మనసులు కలవడంతో కలిసి ఉంటున్నామని, త్వరలోనే అందరి ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రస్తుతం మంచి అంచనాలే ఉన్నాయి.
Next Story