Mon Dec 15 2025 04:06:44 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : కేరళకు ప్రభాస్ రెండు కోట్ల విరాళం
సినీనటుడు ప్రభాస్ కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

సినీనటుడు ప్రభాస్ కేరళ విలయానికి చలించి పోయారు. ప్రభాస్ కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలుగు హీరోల్లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించి ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి దాదాపు నాలుగు వందల మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ నుంచి...
అయితే దీనిపై ఇప్పటికే టాలీవుడ్ నుంచి అనేక మంది హీరోలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్చరణ్ కలసి కోటి రూపాయలను ప్రకటించారు. తాజాగా ప్రభాస్ రెండు కోట్ల రూపాయాలను ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నారు.
Next Story

