Mon Dec 23 2024 16:33:56 GMT+0000 (Coordinated Universal Time)
క్షోభ పెడుతూ.. ప్రోత్సహిస్తున్నామంటారా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమారంగంపై ఈ ఆధిపత్య ధోరణి ఏంటని ఆయన ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమారంగంపై ఈ ఆధిపత్య ధోరణి ఏంటని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం పేరు ఎత్తకుండానే ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. సృజన, సాంకేతిక మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం ఏంటని నిలదీశారు. క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామని చెప్పడమేంటని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
పరోక్షంగా ఏపీ సర్కార్ పై.....
ప్రకాష్ రాజ్ ఇటు భీమ్లా నాయక్ సినిమా పేరును, అటు ఏపీ ప్రభుత్వం పేరును నేరుగా ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం తొక్కేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమను ప్రోత్సహిస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం వెనక్కు లాగుతుందని పలువురు ఆరోపణలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం టిక్కెట్ ధరల నిర్ణయం ఇంకా జరగలేదని, పుష్ప, అఖండ, బంగర్రాజు సినిమాల షరతులే భీమ్లా నాయక్ కు వర్తించాయని చెబుతుంది. మొత్తం మీద ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏపీలో హాట్ టాపిక్ గా మరింది.
Next Story