Mon Dec 23 2024 09:03:36 GMT+0000 (Coordinated Universal Time)
ఇక సినిమాలు చేయను : నటుడు రాహుల్ రామకృష్ణ
అర్జున్ రెడ్డి తర్వాత రాహుల్ రామకృష్ణ.. కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస
సినీ పరిశ్రమ.. ఎంతో మందికి ఉపాధినిస్తోన్న పరిశ్రమ ఇది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి చాలామంది యువనటులు పరిచయం అయ్యారు. వారిలో తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కమెడియన్ గానే కాకుండా.. మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ చేసిన షార్ట్ ఫిలిం "సైన్మా" లో లీడ్ రోల్ చేసి గుర్తింపు పొందారు. ఆ తర్వాత "అర్జున్ రెడ్డి" సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి.. స్టార్ గా ఎదిగాడు.
Also Read : మేజర్ కు రూట్ క్లియర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ !
అర్జున్ రెడ్డి తర్వాత రాహుల్ రామకృష్ణ.. కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా.. రాహుల్ రామకృష్ణ చేసిన ఓ ట్వీట్ అందరినీ షాక్ కు గురిచేసింది. నెట్టింట్లో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. "2022తో సినిమాలు ఆపేస్తున్నాను. ఇకపై నేను సినిమాలు చేయను. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను" అని ట్వీట్ చేశాడు. కెరియర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు రాహుల్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇది నిజమేనా ? లేక ఏదైనా సినిమా ప్రమోషనల్ స్టంటా అని మరికొందరు ఆలోచిస్తున్నారు.
Next Story