Mon Dec 23 2024 12:02:58 GMT+0000 (Coordinated Universal Time)
సారీ చెప్పిన సోనూ సూద్.. వైరల్
ప్రముఖ నటుడు సోనూ సూద్ రైల్వే శాఖకు క్షమాపణ చెప్పారు. తాను చేసిన పనికి క్షమించాలని ఆయన రైల్వే అధికారులను కోరారు
ప్రముఖ నటుడు సోనూ సూద్ రైల్వే శాఖకు క్షమాపణ చెప్పారు. తాను చేసిన పనికి క్షమించాలని ఆయన రైల్వే అధికారులను కోరారు. ఇందుకు కారణాలేంటంటే? సోనూ సూద్ ఇటీవల రైలులో ఫుట్ బోర్డు ప్రయాణం చేశారు. అది వీడియోను తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అభ్యంతరం....
అయితే ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేస్తూ వీడియో తీయడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై రైల్వే అధకారులు తప్పుపట్టారు. ఇది యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్లని వారు ప్రశ్నించారు. దీంతో సోనూ సూద్ రైల్వే శాఖ అధికారులకు క్షమాపణ చెప్పారు. తాను చేసిన పనికి చింతిస్తున్నానని తెలిపారు. తన పోస్టును తొలగించారు. నెటిజన్ల నుంచి కూడా సోనూ సూద్ విమర్శలు ఎదుర్కొన్నారు.
Next Story