Thu Jan 02 2025 13:05:53 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ ను పెళ్లాడిన కేజీఎఫ్ నటుడు
‘తకిట తకిట’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హరిప్రియకు.. ఆ తర్వాత వచ్చిన పిల్ల జమీందార్ తో మంచి గుర్తింపు..
కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా - పిల్ల జమిందార్ ఫేమ్ నటి హరిప్రియ వివాహంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య మీడియాకు దూరంగా.. మైసూరులో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి హాజరైన నటుడు ధనుంజయ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలుపడంతో వశిష్ఠ-హరిప్రియ పెళ్లి వెలుగులోకి వచ్చింది.
‘తకిట తకిట’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హరిప్రియకు.. ఆ తర్వాత వచ్చిన పిల్ల జమీందార్ తో మంచి గుర్తింపు వచ్చింది. ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జైసింహా’ వంటి సినిమాల్లో నటించింది. నారప్ప సినిమాతో తెలుగుతెరపై కనిపించాడు వశిష్ఠ. అంతకుముందు కేజీఎఫ్ లో కమల్ అనే పాత్రలో కనిపించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నయీం డైరీస్’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాల్లోనూ వశిష్ఠ సింహా నటించాడు.
Next Story