Sat Dec 21 2024 17:55:58 GMT+0000 (Coordinated Universal Time)
పిశాచి 2లో నగ్నంగా నటించిన హీరోయిన్ ఆండ్రియా..
8 ఏళ్ల ముందు సీనియర్ డైరెక్టర్ మిస్కిన్ తీసిన పిశాచి సినిమాకు ఇది సీక్వెల్. గతంలో ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్స్‌లో..
ప్రేక్షకులు రొటీన్ సినిమాలను చూడటం మానేసి చాలా రోజులైంది. వినోదం కేవలం థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన కథా చిత్రాలను, వెబ్ సిరీస్ లను, క్రైం బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. ప్రేక్షకుడికి నచ్చేట్టుగా ఎలాంటి పాత్రైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు నటీనటులు. ఒక్కోసారి బోల్డ్ గా చేయాల్సి ఉన్నా.. నో చెప్పట్లేదు కానీ.. ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నటి ఆండ్రియా పిశాచి 2 సినిమాలో బోల్డ్ గా నటించిందట. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడే రివీల్ చేశారు.
కోలీవుడ్‌లో కథానాయకిగా, ప్రధాన పాత్రధారిగా, గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించిన ఆండ్రియా.. టాలీవుడ్ లోనూ తన టాలెంట్ చూపిస్తోంది. ఆండ్రియా నటించిన సినిమాల్లో చాలా సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్లే. 8 ఏళ్ల ముందు సీనియర్ డైరెక్టర్ మిస్కిన్ తీసిన పిశాచి సినిమాకు ఇది సీక్వెల్. గతంలో ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్స్‌లో నటించిందటూ వార్తలు వినిపించగా.. అది నిజమేనని డైరెక్టర్ మిస్కిన్ కన్ఫర్మ్ చేశారు.
''పిశాచి 2లో ఆండ్రియా న్యూడ్‌గా నటించిన మాత్రమే నిజమే. అయితే వాటిని ఫొటోలుగానే తీశాం. కానీ సన్నివేశాలుగా చిత్రీకరించలేదు. ఓ లేడీ ఫొటోగ్రాఫర్ మాత్రమే ఆ ఫొటోలను తీసింది. అలా చేయటానికి ఆండ్రియా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంది. కుటుంబంతో సహా సినిమా చూసే వారికి ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఉంటే ఇబ్బందికరంగా ఉంటాయనటంలో డౌట్ లేదు. అందుకని ఆ ఫొటోలను సినిమాలో చూపించలేదు. సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరం కూడా వస్తుందని ఫొటోలను చూపించకుండా డిలీట్ చేసేశాను'' అని మిస్కిన్ తెలిపారు. ఆగస్టు 31న పిశాచి 2 విడుదలవుతుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కానీ.. ఈ సినిమా విడుదల వాయిదా పడొచ్చని తెలుస్తోంది.
News Summary - Actress Andrea Jeremiah Nude Photo Shoot for Pisasu 2 movie
Next Story