Mon Dec 23 2024 20:17:26 GMT+0000 (Coordinated Universal Time)
Actress Anjali: ఇబ్బందికరమైన ప్రశ్న.. అంజలి సమాధానం వైరల్
నేను అడుగుతుంది పుష్పను కాదు అంజలిని
సినిమా, వెబ్ సిరీస్ ల ప్రమోషన్ల కోసం వచ్చినప్పుడు నటీనటులు, టెక్నీషియన్స్ వివిధ రకాల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్లలో కొన్ని ఊహించని ప్రశ్నలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలను కొందరు దాటవేస్తే మరికొందరు మాత్రం ఎంతో ధైర్యంగా సమాధానం చెబుతూ ఉంటారు.
తాజాగా నటి అంజలికి అలాంటి ప్రశ్ననే ఎదురైంది. ఆమె కొత్త వెబ్ సిరీస్ 'బహిష్కరణ' ను ప్రమోట్ చేస్తున్నప్పుడు అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఏ నటుడితో సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించడంలో ఆమె ఇబ్బంది పడ్డారని ఓ మీడియా వ్యక్తి అడిగారు. అనవసరమైన ప్రశ్న అయినప్పటికీ అంజలి మంచి సమాధానం ఇచ్చారు. "చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా? శివయ్య తోనా?" అని ప్రశ్నించారు. "ఇబ్బంది గురించి అడుగుతున్నారా.. ఇబ్బంది పుష్పకు ఉండదు కానీ, అంజలికి ఉంటుంది" అని అంజలి ఆన్సర్ ఇచ్చింది. "నేను అడుగుతుంది పుష్పను కాదు అంజలిని" అని రిపోర్టర్ మరోసారి అన్నారు. దానికి "అంజలి విషయానికొస్తే.. శ్రీతేజ్తో కలిసి నటించినా.. రవీంద్ర విజయ్తో నటించినా ఇబ్బందే. ఎందుకంటే ఏ సీన్ షూట్ చేసే సమయంలో అయినా 20 మంది సెట్లో ఉంటారు. మేల్ యాక్టర్స్ అయినా అలాంటి సన్నివేశాల్లో నటించడం తేలిక కాదు" అని అంజలి సమాధానం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Next Story