Sun Dec 22 2024 21:14:20 GMT+0000 (Coordinated Universal Time)
అనవసరంగా నా పేరు లాగుతున్నారు: అషు రెడ్డి
డ్రగ్స్ కేసులో ఇటీవల నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ కేసులో ఇటీవల నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలిసింది. కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ, మరో నటితోనూ వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. విచారణ సమయంలో ఈ కాల్స్ పై అతడు మౌనం వహించాడు. కేపీ చౌదరి నుంచి డ్రగ్స్ అందుకునే ఖాతాదారుల్లో సెలెబ్రిటీలు కూడా ఉన్నట్టు వెల్లడైంది. కేపీ చౌదరి బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించి, 11 లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్, గోవాల్లో జరిగిన పార్టీల్లో సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నారా? అనే కోణంలోనూ పోలీసులు నిర్మాత కేపీ చౌదరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
కొన్ని మీడియా సంస్థలు బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పేరును లాగాయి. దీంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అషురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కొన్ని మీడియా వర్గాల్లో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని అషు రెడ్డి తెలిపింది. అవసరమైతే, సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు వాస్తవమేమిటో వివరిస్తానని స్పష్టం చేశారు. తన ఫోన్ నంబర్‌ను తన అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే.. అస్సలు సహించేది లేదంటూ హెచ్చరికలు చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అందుకు సంబంధించి ఒక పోస్టు చేశారు.
Next Story