Mon Dec 23 2024 05:32:09 GMT+0000 (Coordinated Universal Time)
మెమొరీ లాస్ తో బాధపడుతోన్న భానుప్రియ
టీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించింది.
తెలుగు అమ్మాయిగా తెలుగు తెరపై నటిగా, డ్యాన్సర్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి భానుప్రియ. భానుప్రియ చిన్నప్పటి నుండే కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ వచ్చింది. ఆ నాట్యమే ఆమెకు సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. తమిళ సినిమా ‘మెల్ల పేసుంగల్’ చిత్రంతో వెండితెరకు పరిచమైన భానుప్రియ.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 150 పైగా సినిమాల్లో నటించింది. పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసిందామె.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోన్న భానుప్రియ.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించింది. మీరు డాన్స్ స్కూల్ పెట్టాలి అనుకున్నారు కదా. ఎందుకు పెట్ట లేదు అని ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి బదులిస్తూ.. అందుకు తన ఆరోగ్య పరిస్థితి సహకరించలేదని చెప్పుకొచ్చారు. తన భర్త మరణం తర్వాత జ్ఞాపకశక్తి తగ్గుతూ వచ్చిందని, ఈ క్రమంలో కొన్ని ముద్రలను మరిచిపోయినట్లు తెలిపారు.
ఇటీవల ఒక సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్స్ చెబుతున్న సమయంలో ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయ్యిపోయి మొత్తం మర్చిపోయినట్లు కూడా చెప్పుకొచ్చింది. 1998లో ప్రముఖ ఫొటో గ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ని భానుప్రియ వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2005లో విడాకులైనట్లు వార్తలు రాగా.. అందులో నిజం లేదని తెలిపింది భానుప్రియ. వృత్తుల పరంగా ఇద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చిందే తప్ప.. విడిపోలేదని స్పష్టం చేశారు.
Next Story