Mon Dec 23 2024 07:29:57 GMT+0000 (Coordinated Universal Time)
విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను : టాలీవుడ్ హీరోయిన్
విడాకుల తర్వాత నోయల్ బిగ్ బాస్ 4లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచిపేరు తెచ్చుకున్నాడు. ఎస్తేర్ కూడా విడాకుల తర్వాత..
విడాకులు.. ఈ రోజుల్లో ఇవి చాలా కామన్ అయిపోయాయి. లవ్ లో ఉన్నవారు బ్రేకప్ చెప్పుకోవడం ఎంత కామనో.. పెళ్లయ్యాక మనస్పర్థలు వస్తే విడిపోవడం కూడా అంతే కామన్ అయింది. సాధారణ ప్రజల విషయం అటుంచితే.. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా జంటలు విడాకులు తీసుకున్నాయి. వాటిలో ఒక జంట నోయల్ - ఎస్తేర్. భీమవరం బుల్లోడు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ నోరోన్హ.. ప్రముఖ ర్యాప్ సింగర్ అయిన నోయల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్దినెలలకే ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. సెన్సేషన్ గా నిలిచారు. జనవరి 2019 లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట అదే ఏడాది జూన్ లో విడాకులతో వేరయింది.
Also Read : రూ.200 కోసం తల్లిని నరికి చంపిన కొడుకు
విడాకుల తర్వాత నోయల్ బిగ్ బాస్ 4లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచిపేరు తెచ్చుకున్నాడు. ఎస్తేర్ కూడా విడాకుల తర్వాత ఒకట్రెండు సినిమాల్లో కనిపించింది. తాజాగా.. ఆమె 69 సంస్కార్ కాలనీ అనే సినిమాలో నటించింది. మార్చి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్తేర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. అలా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్తేర్.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Also Read : మెత్త బడ్డ జగ్గారెడ్డి.. రాజీనామా నిర్ణయం వాయిదా
నోయల్ తో విడాకుల గురించి మాట్లాడుతూ.. విడాకుల సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. అన్నింటికీ సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న క్షణంలో ఆ ఒత్తిడి నుంచి బయటికి రాగలిగానని పేర్కొంది. "బయటి వాళ్ళ విడాకుల గురించి వినడమే కానీ నాకే ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. దీనిపై నా ఫ్యామిలీకి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలని భయపడ్డాను. కానీ నా తల్లిదండ్రులు నాకు అండగా నిలబడ్డారు. దీంతో నాకు రెట్టింపు ధైర్యం, ఎనర్జీ వచ్చింది. విడాకుల తర్వాత నేను మరింత ఫ్రీగా, సంతోషంగా ఉన్నాను." అని ఎస్తేర్ తెలిపింది.
Next Story