Mon Dec 23 2024 07:49:55 GMT+0000 (Coordinated Universal Time)
హన్సికకు కాబోయే భర్తకు ఆల్రెడీ పెళ్లయిందా?
అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. హన్సిక భర్తకి ఆల్రెడీ పెళ్లైపోయిందని..
నటి, యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిసిందే. ఇటీవలే తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది హన్సిక. అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. హన్సిక భర్తకి ఆల్రెడీ పెళ్లైపోయిందని, అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే అని, వాళ్ళు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగా.. సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కి.. 2016లోనే హన్సిక పెళ్లైపోయిందని తెలుస్తోంది.వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఓ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. రింకీ హన్సికకి స్నేహితురాలేనట. సోహెల్ కూడా ఎప్పట్నుంచో హన్సికకి స్నేహితుడు అట. రింకీ - సోహెల్ విడిపోయాక సోహెల్ హన్సికకు దగ్గరయ్యాడని సమాచారం. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నాకే ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు, నెటిజన్లు ఇది నిజమేనా అని హన్సికను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై హన్సిక ఇప్పటి వరకూ స్పందించలేదు.
Next Story