Mon Dec 23 2024 15:59:36 GMT+0000 (Coordinated Universal Time)
కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక.. నెట్టింట ఫొటోలు వైరల్
కాబోయే భర్తని పరిచయం చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టింది. అవి చూసిన నెటిజన్లంతా ఆమెకు శుభాకాంక్షలు..
సినీ నటి హన్సిక.. పెళ్లి చేసుకోబోతోందని ఇప్పటికే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హన్సిక తనకు కాబోయే భర్తని పరిచయం చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టింది. అవి చూసిన నెటిజన్లంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద అతను ఉంగరంతో ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్లు తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హన్సిక.
ముంబైలోని సింధీల కుటుంబంలో పుట్టిన హన్సిక.. బాల్యంలోనే తెరంగేట్రం చేసింది. తెలుగులో కంత్రీ, మస్కా, దేశముదురు, బిల్లా, కందిరీగ సినిమాలతో పేరు తెచ్చుకున్న హన్సిక.. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినీ అవకాశాలు లేకే ఈ యాపిల్ బ్యూటీ పెళ్లిబాట పట్టినట్లు ఇండస్ట్రీ టాక్. డిసెంబర్ 4న జైపూర్ లోని ఓ పాత రాజభవనంలో హన్సిక పెళ్లి జరగనుంది. అందుకోసం తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సొహైల్ కతారియా అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుంది.
Next Story