పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా .. మరి తండ్రెవరు ?
తాజాగా అభిమానులు, నెటిజన్లకు షాకిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఇలియానా రెండు ఫొటోలను..
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేవదాసుతో మొదలైన ఆమె టాలీవుడ్ ప్రయాణం పోకిరి, కిక్, జులాయి వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ గానే నడిచింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావడం, ఇలియానా కూడా జీరో సైజ్ నుంచి కాస్త చబ్బీగా తయారవడంతో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోందీ గోవా భామ. తాజాగా అభిమానులు, నెటిజన్లకు షాకిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఇలియానా రెండు ఫొటోలను షేర్ చేసింది. ఒక ఫొటోలో ‘అడ్వెంచర్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఉన్న టీషర్ట్ ఉండగా.. మరో ఫొటోలో తన మెడలో వేలాడుతున్న ఓ పెండెంట్ ను చూపించింది. ఆ పెండెంట్ పై మామా (అమ్మ) అనే ఇంగ్లిష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల కింద ‘కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ జతచేసింది. మై లిటిల్ డార్లింగ్.. నిన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఇలియానా తన పోస్టులో పేర్కొన్నారు.