Mon Dec 15 2025 00:23:29 GMT+0000 (Coordinated Universal Time)
మూడో పెళ్లి వార్తలపై స్పందించిన జయసుధ.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..
అలా అవి మీడియా వరకూ చేరి.. వైరల్ న్యూస్ అయింది. జయసుధ మొదటి భర్తతో విభేదాలతో విడిపోయాక..

చిన్నతనంలోనే సినిమారంగంలోకి అడుగుపెట్టి.. హీరోయిన్ గా ఎదిగి.. సహజనటి అని పేరు సంపాదించుకున్న నటి జయసుధ. హీరోయిన్ గా, అమ్మగా, అత్తగా, బామ్మగా.. ఆనాటి నుండీ ఈనాటి వరకూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులోనే కాదు.. తమిళం, మళయాళ, కన్నడ భాషలతో పాటు పలు హిందీ సినిమాల్లోనూ నటించిందామె. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ పక్కన నటించిన జయసుధ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు పోషిస్తూ వస్తుంది. తాజాగా వచ్చిన విజయ్ "వారసుడు" సినిమాలోనూ హీరోకి తల్లిగా నటించింది.
అయితే.. ఇటీవల జయసుధ గురించి.. సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. అదే.. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని గుసగుసలు మొదలయ్యాయి. అలా అవి మీడియా వరకూ చేరి.. వైరల్ న్యూస్ అయింది. జయసుధ మొదటి భర్తతో విభేదాలతో విడిపోయాక.. బాలీవుడ్ హీరో జితేంద్రకపూర్ కజిన్ నితిన్ కపూర్ ను రెండోపెళ్లి చేసుకుంది. 2017లో అనారోగ్య సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుండీ జయసుధ ఒంటరిగానే ఉంటుంది. కానీ.. ఈ మధ్య ఆమె వెంట ఒక అమెరికన్ వ్యక్తి కనిపిస్తున్నాడు. దాంతో జయసుధ, అతనిని రహస్యంగా వివాహం చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై జయసుధ స్పందించింది. తన మూడో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అతను నా బయోపిక్ తీయడానికి అమెరికా నుంచి వచ్చాడు. స్పిరిచ్యువల్ బయోపిక్ కావడంతో నేను క్రిస్టియానిటీలోకి ఎలా మారాను? అంతకు ముందు నా లైఫ్ ఎలా ఉండేది? ప్రస్తుతం నా లైఫ్ అండ్ కెరీర్ ఎలా ఉంది? అనే దాని మీద పరిశోధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి నాతో ప్రయాణిస్తూ వస్తున్నాడు. అంతకు మించి ఏమి లేదు అని తెలిపింది. దాంతో జయసుధ మూడో పెళ్లి పుకారు వార్తలకు బ్రేక్ పడింది.
Next Story

