Mon Dec 23 2024 07:57:25 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లల కోసం ఆ రెండింటికీ రెడీ : కరాటే కల్యాణి
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మనసులో మాట చెప్పారు. భార్య అంటే కేవలం వంటింటికే పరిమితం కాదని, తాను ఆ కోవకు
కరాటే కల్యాణి.. బిగ్ బాస్ లోకి రాకముందే ఈ పేరు బాగా ఫేమస్ అయింది. టాలీవుడ్ లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమాల గురించే కాదు.. సామాజిక సమస్యలపైనా ఆమె గళం విప్పుతుంటారు. న్యాయ పోరాటం చేయడంలో వెనకడుగు వేయరు. ముక్కుసూటితనం. మనసులో ఏది ఉంటే.. అది ఠక్కున అనేస్తారు. పైకి నవ్వుతూ కనిపించే ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న కరాటే కల్యాణి.. మనస్పర్థల కారణంగా రెండుసార్లూ విడాకులు తీసుకున్నారు.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మనసులో మాట చెప్పారు. భార్య అంటే కేవలం వంటింటికే పరిమితం కాదని, తాను ఆ కోవకు చెందిన మహిళను కాదని చెప్పుకొచ్చారు. అందుకే తన వైవాహిక జీవితం మధ్యలోనే ముగిసిందని తెలిపారు. తనను అర్థం చేసుకోకపోవడంతో.. వాళ్లతో గొడవలు పడలేక విసిగిపోయి విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒంటరి జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. నిజమైన ప్రేమ దొరికితే మూడో పెళ్లికి కూడా సిద్ధమేనని కల్యాణి తెలిపారు. పిల్లలంటే తనకు చాలా ఇష్టమన్న కల్యాణి.. పిల్లల్ని కనేందుకు పెళ్లికైనా.. సహజీవనానికైనా రెడీ అని చెప్పుకొచ్చారు.
Next Story