Sun Dec 22 2024 21:17:42 GMT+0000 (Coordinated Universal Time)
చిన్న వయసులోనే కన్నుమూసిన నటి లక్ష్మిక
లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్
సినిమా, టెలివిజన్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో కన్నుమూశారు. ఆమె వయస్సు 24. ఆమె గుండెపోటు కారణంగా మరణించింది. ఆమె మరణ వార్త మళయాళ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఆమె చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నవంబర్ 2 న పెట్టింది. అందులో ఆమె సూర్యాస్తమయానికి సంబందించిన అందమైన చిత్రాన్ని పంచుకుంది.
ఆమె అకాల మరణ వార్త గురించి తెలుసుకున్న వెంటనే.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాలలో ఆమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. అజు అజీష్ దర్శకత్వం వహించిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
Next Story