Mon Dec 23 2024 11:29:03 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరీ నటి లిషి గణేష్
రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీ నటి లిషి గణేష్ పేరు వచ్చింది. ఆమె పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు
రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీ నటి లిషి గణేష్ పేరు వచ్చింది. ఆమె పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు గుర్తింపు.. ఎఫ్ఐఆర్లో లిషి గణేష్‌తో పాటు మరో వీఐపీ శ్వేతా పేరును ఉంచారు. గతంలో లిషి గణేష్ సోదరి కుషిత కూడా పబ్ కు వచ్చిందనే విషయమై బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. యూ ట్యూబర్స్గా లిషి గణేష్, కుషితకు గుర్తింపు. లిషి గణేష్‌ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్ఐఆర్లో ఆమెతోపాటు మరో సెలబ్రేటి శ్వేతా పేరును కూడా నమోదు చేశారు.
గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొందరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్ లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ (BJP) నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు.
Next Story