Tue Apr 01 2025 08:53:47 GMT+0000 (Coordinated Universal Time)
అలనాటి స్టార్ హీరోయిన్, ఆమె ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ !
అలనాటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం సీనియర్ నటి అయిన మీనా.. ఒక పోస్ట్ తో తన అభిమానులకు షాకిచ్చారు. తనతో పాటు.. కుటుంబం

అలనాటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం సీనియర్ నటి అయిన మీనా.. ఒక పోస్ట్ తో తన అభిమానులకు షాకిచ్చారు. తనతో పాటు.. కుటుంబం మొత్తానికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు ఆమె బాంబ్ పేల్చారు. ఈ విషయాన్ని కొంచెం హాస్యం, కొంచెం వెటకారంతో ట్వీట్ చేశారు మీనా. " 2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దాన్ని ఉండనివ్వను. ప్రజలారా జాగ్రత్త. భద్రంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకూ చోటివ్వండి" అంటూ ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు మీనా ఒక ఫొటోను జోడించగా.. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Next Story