Sun Dec 22 2024 08:15:53 GMT+0000 (Coordinated Universal Time)
MeenakshiChaudhary:మరో క్రేజీ ప్రాజెక్టులో మీనాక్షి చౌదరి
గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ
MeenakshiChaudhary:మీనాక్షి చౌదరి.. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. మీనాక్షిని మరీ అంత చిన్న క్యారెక్టర్ లో చూస్తామని ఆమె ఫ్యాన్స్ అసలు ఊహించలేదు. ఒక పాటలో కూడా మీనాక్షి కనిపించలేదు. అయితే అమ్మడికి వరుస ఆఫర్లు మాత్రం టాలీవుడ్ లో వస్తూనే ఉన్నాయి. మీనాక్షి చౌదరి దక్షిణాదిలోని వివిధ పరిశ్రమల నుండి ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉంది. విజయ్ తో GOAT సినిమాలో నటిస్తూ ఉంది మీనాక్షి. మహేష్ బాబు, విజయ్ వంటి స్టార్స్ తో చేస్తుండడంతో మీనాక్షికి టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. గోట్ తర్వాత, ఆమె వరుణ్ తేజ్ మట్కా.. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలలో నటిస్తూ ఉంది. ఇక విశ్వక్ సేన్‌తో ఒక చిత్రంలో కనిపించనుంది.
మరో క్రేజీ ప్రాజెక్టులో మీనాక్షి చౌదరి నటిస్తూ ఉందని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే మరో భారీ టాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ పతాకంపై బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న మెగా ఫాంటసీ అడ్వెంచర్ సినిమా. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు.. చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ వ్యయంతో కూడుకున్న చిత్రమని అంటున్నారు.
Next Story