Sun Dec 22 2024 19:36:35 GMT+0000 (Coordinated Universal Time)
నటి పూజాహెగ్డే ఇంట పెళ్లి సంబరాలు.. ఇంత ఆనందంగా ఎప్పుడూ లేనంటూ పోస్ట్
శివాని అనే అమ్మాయిని గత కొన్నేళ్లుగా ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి.. ముంబైలోని ఓ ప్రైవేట్..
ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. పూజా హెగ్డె అన్నయ్య రిషబ్ హెగ్డే తన ప్రియురాలైన శివానీ శెట్టిని వివాహమాడాడు. ఈ విషయాన్ని పూజా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ.. తన అన్న పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుండి మునుపెన్నడూ లేనంత సంతోషంగా ఉన్నానని పేర్కొంది పూజా. చిన్న పిల్లలా నవ్వేశానని, ఆనందబాష్పాలు రాల్చానని అన్నారు.
రిషబ్ హెగ్డే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. శివాని అనే అమ్మాయిని గత కొన్నేళ్లుగా ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి.. ముంబైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లిచేసుకున్నాడు. "అన్నా, నువ్వు నీ జీవితంలో నెక్స్ట్ దశలోకి అడుగుపెడుతున్నప్పుడు, ప్రేమ, ఆనందం, శాంతితో పూర్తిగా ఆస్వాదిస్తావని భావిస్తున్నాను. శివాని నువ్వు అందమైన, అద్భుతమైన అమ్మాయివి. మా కుటుంబంలోకి నీకు స్వాగతం" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది పూజా హెగ్డే. ప్రస్తుతం రిషబ్ హెగ్డే పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story