Mon Dec 23 2024 11:06:17 GMT+0000 (Coordinated Universal Time)
Ruhani Sharma : ఈ హీరోయిన్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట..
టాలీవుడ్ హీరోయిన్ రుహాణి శర్మ.. విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట. ఈ విషయం ఆమె కన్ఫార్మ్ చేసింది.
Ruhani Sharma : టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రుహాణి శర్మ.. విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట. ఈ విషయం ఆమె కన్ఫార్మ్ చేసింది. రీసెంట్ గా రుహాణి శర్మ భామ ఒక షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఆ ఈవెంట్ లో రుహాణిని విరాట్ కోహ్లీతో ఉన్న సంబంధం గురించి ప్రశ్నించగా.. ఆమె కోహ్లీకి మరదలు అవుతునంటూ అందరికి తెలియజేశారు. ఇంతకీ ఆమెకు, కోహ్లీకి ఎలా బంధం ఏర్పడిందో తెలుసా..?
బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.. రుహాణి శర్మకి బంధువు అవుతుందట. అనుష్క, రుహాణికి సిస్టర్ వరుస అవుతుందట. ఆ రకంగా రుహాణికి కోహ్లీ బావ అయ్యారు. ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక ఆ ఈవెంట్ లో రుహాణికి ఆ ప్రశ్న ఎదురవ్వడంతో ఆమె ఓపెన్ అయ్యి.. అనుష్క, కోహ్లీతో ఉన్న బంధం గురించి మాట్లాడారు.
"అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుందని, విరాట్ కోహ్లీ బావ అవుతారని చాలామందికి తెలియదు. ఎందుకంటే నా పర్సనల్స్ ఎప్పుడు నేను ఎవరికి తెలియజేయలేదు. కోహ్లీ చాలా మంచివారు, నాతో చాలా బాగా మాట్లాడతారు. వారిద్దరి చాలా సింపుల్ గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు. అందరితో చాలా ఓపెన్ గా ఉంటారు. అందుకే నాకు వారంటే చాలా ఇష్టం" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పుడు ఈ విషయం తెలియడంతో ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు. కాగా రుహాణి తమిళ్ సినిమాతో సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. రెండో సినిమాగా తెలుగులో 'చిలసౌ' చిత్రంలో నటించి మొదటి హిట్ అందుకున్నారు. ఆ తరువాత హిట్, హర్, సైంధవ్ సినిమాల్లో నటిస్తూ తెలుగులో హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
Next Story