Mon Dec 23 2024 03:34:42 GMT+0000 (Coordinated Universal Time)
సదా మదిలో మాట.. కాబోయే భర్త అలా ఉండాలట !
యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాక చాలామంది తనను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండంటూ కామెంట్ చేశారని, ఆ కామెంట్లు చూసి..
జయం, దొంగ దొంగది, అపరిచితుడు వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సదా.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరమైనా తమిళ్, తెలుగు బుల్లితెరలపై ఆయా షో లలో కనిపిస్తూ వినోదాన్ని పంచుతోంది. ఇటీవలే సదా నటించిన HELLO WORLD వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకుంది. కాగా.. తాజాగా సదా పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సదా పెళ్లి గురించి టాపిక్ రాగా.. దానిపై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది.
మన సంతోషం కోసం ఇతరులపై ఆధారపడేందుకు పెళ్లిచేసుకుంటే.. అవతలివారు సంతోషంగా ఉండలేరన్నది తన అభిప్రాయమని చెప్పుకొచ్చింది. పెళ్లి పేరుతో మరో వ్యక్తిపై ఆధారపడితే.. ఆ ప్రెషర్ అంతా వారే భరించాలని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాక చాలామంది తనను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండంటూ కామెంట్ చేశారని, ఆ కామెంట్లు చూసి తనకు చాలా కోపం వచ్చిందన్నారు. 38 ఏళ్లు వచ్చినా పెళ్లికాకపోతే నాకు లేని బాధ వాళ్లకి ఎందుకు ? ఒకరి జీవితంపై కామెంట్స్ చేసే హక్కు వాళ్లకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఈ రోజుల్లో అరేంజ్డ్, లవ్ మ్యారేజీలు చేసుకున్న వారిలో చాలా వరకూ మనస్పర్థలు వస్తున్నాయన్నారు. 10 పెళ్లిళ్లు జరిగితే.. వాటిలో 5 జంటలైనా హ్యాపీగా ఉండట్లేదని కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది సదా. పోనీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడు అయి ఉండాలి అన్న ప్రశ్నకు తన మదిలో మాట చెప్పింది. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి ధనవంతుడు కాకపోయినా ఫర్వాలేదు కానీ.. బ్రతకడం కోసం పక్కవారిపై ఆధారపడకూడదని చెప్పింది. తన అవసరాల కోసమైనా తాను సంపాదించుకోగలగాలని, అలాగే పూర్తి శాఖాహారి అయి ఉండాలని సదా మదిలో మాట చెప్పింది.
Next Story