Mon Dec 23 2024 15:35:56 GMT+0000 (Coordinated Universal Time)
సాయి పల్లవి గురించి నార్త్ మీడియా ఇలా ప్రమోట్ చేస్తోందే
దక్షిణాదిన ఎంతో స్టార్డమ్ ఉన్న యాక్ట్రెస్ సాయి పల్లవి. అయితే
దక్షిణాదిన ఎంతో స్టార్డమ్ ఉన్న యాక్ట్రెస్ సాయి పల్లవి. అయితే ఆమె సెలెక్టివ్ గా సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. ఒక్కో సినిమాకు.. ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంది సాయి పల్లవి. గార్గి (2022)లో చివరిగా కనిపించిన నటి సాయి పల్లవి తన తదుపరి చిత్రం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే బాలీవుడ్ బజ్ ప్రకారం, సాయి పల్లవి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రేమకథా చిత్రమని బాలీవుడ్ మీడియా చెబుతోంది. తన పాత్రల విషయంలో చాలా సెలెక్టివ్గా ఉండే సాయి పల్లవి ఈ సినిమాకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి బాలీవుడ్లో మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ తర్వాత, అమీర్ ఖాన్ నటనకు విరామం తీసుకున్నాడు. అతని కుమారుడు జునైద్ YRF సంస్థలో అరంగేట్రం చేయనున్నాడు. సాయి పల్లవితో ఒక లవ్ స్టోరీ లో కూడా నటించబోతున్నాడని నార్త్ మీడియా చెబుతోంది.
Next Story