Mon Dec 23 2024 13:59:09 GMT+0000 (Coordinated Universal Time)
విడాకుల తర్వాత స్పీడ్ పెంచిన సమంత
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచారు.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచారు. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన సమంత విడాకుల తర్వాత మళ్లీ సైన్ లు చేస్తున్నారు. ఇక్కడ సమంత తొలిసారి ఒక హాలీవుడ్ మూవీకి సైన్ చేయడం ఆమె అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఎవరికీ దొరకని అవకాశాన్ని సమంత చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా సమంత తెలియజేయడంతో అక్కినేని అభిమానులతో పాటు, సమంత ఫ్యాన్స్ కూడా తెగ ఆనంద పడిపోతున్నారు.
హాలీవుడ్ లో....
అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ చిత్రంలో సమంత నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నారు. సమంత ప్రస్తుతం టాలివుడ్, కోలివుడ్ లలో రెండు సినిమాల్లో నటిస్తుంది.
Next Story