Mon Dec 23 2024 10:20:58 GMT+0000 (Coordinated Universal Time)
Devara : ‘దేవర’లో నా పాత్ర అదే.. హీరోయిన్ శృతి మరాఠే..
‘దేవర’లో తన పాత్ర అదేనంటూ లీక్ చేసేసిన మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే. ఎన్టీఆర్కి..
Devara : ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వీరితో పాటు మరాఠీ హీరోయిన్ ‘శృతి మరాఠే’ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ మూవీ టీం నుంచి మాత్రం ఏంటివంటి సమాచారం లేకపోవడంతో అవన్నీ నిన్నటి వరకు రూమర్స్ గా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు అన్ని నిజమే అంటూ శృతి మరాఠే చెప్పుకొచ్చారు. రీసెంట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి మరాఠే మాట్లాడుతూ.. "నేను దేవరలో నటిస్తున్నట్లు ఎలా తెలిసిందో గాని, ఆ వార్త సోషల్ మీడియాలో ఇప్పటికే లీక్ అయ్యింది. నేను ఆ మూవీలో దేవరకి భార్యగా నటిస్తున్నాను. ఆ మూవీ కోసం నేను ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తరువాత మరో విషయం పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ రోల్స్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పటివరకు రూమర్స్ గా ఉన్నాయి. ఇప్పుడు శృతి మరాఠే చేసిన కామెంట్స్ చూస్తుంటే.. ఆమె తండ్రి పాత్రకి జోడిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ మూవీ మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు.
Next Story